paruchuri: ప్రభాస్ మూవీలో పేదింటి అమ్మాయిగా పూజా హెగ్డే

  • 'సాహో' షూటింగుతో బిజీగా ప్రభాస్
  • తదుపరి మూవీ రాధాకృష్ణతో 
  • ఇతర భాషల్లోను విడుదల    

ప్రస్తుతం ప్రభాస్ .. 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా 1960 కాలంనాటి ప్రేమకథగా రూపొందుతుందనీ, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్త ఇటీవలే బయటికి వచ్చింది.

 ఈ సినిమాలో పూజా హెగ్డే .. పేదింటి అమ్మాయిగా కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ పేదింటి అమ్మాయి ప్రేమలో అంతటి శ్రీమంతుడు ఎలా పడతాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ ఈ కథ కట్టి పడేస్తుందని అంటున్నారు. యూత్ .. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. యాక్షన్ తో కూడిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News