Andhra Pradesh: ఏపీలో సంక్రాంతి సెలవులు... 7 నుంచి కాదు... 12 నుంచి!

  • క్యాలెండర్ ప్రకారం 8 నుంచి 17 వరకూ సెలవులు
  • 2 నుంచి 11 వరకూ జన్మభూమి - మా ఊరు
  • విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ ఆలోచన
  • సెలవులను మార్చే అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు జనవరి 12 నుంచి 21 వరకూ సంక్రాంతి సెలవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే నెల 8 నుంచి 17 వరకూ సంక్రాంతి సెలవులు ఇవ్వాలని అకడమిక్‌ క్యాలెండర్‌ లో ముందే నిర్ణయించారు. అయితే, 2 నుంచి 11 వరకూ 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టినందున, ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో సెలవులను మార్చాలని ఎన్సీఈఆర్‌టీ నుంచి పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై ఆమె ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించి తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారని తెలుస్తోంది.
Andhra Pradesh
Sankranti
Holidays
Janmabhoomi - Maa Ooru

More Telugu News