trump: వైట్ హౌస్ లో ఒంటరిగా ఎదురు చూస్తున్నా: ట్రంప్

  • సరిహద్దు భద్రత విషయంలో డెమోక్రాట్లు కలసి వస్తారని ఆశిస్తున్నా
  • మెక్సికో సరిహద్దులో గోడ కట్టకపోతే ముప్పు తప్పదు
  • డెమోక్రాట్లది ముమ్మాటికీ వెర్రితనమే
తాను ఒంటరినైపోయానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం విషయంలో డెమోక్రాట్లు కలసి రాకపోవడంపై మండిపడ్డారు. సరిహద్దు భద్రత విషయంలో డెమోక్రాట్లు తనతో కలసి వస్తారని తాను ఆశిస్తున్నానని.. వైట్ హౌస్ లో వారి కోసం ఒంటరిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. డెమోక్రాట్లు కలసిరాకపోతే... గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చు కన్నా ఏదో ఒక రోజు అంతకన్నా ఎక్కువ నష్టం వాటిల్లుతుందని అన్నారు. డెమోక్రాట్లది ముమ్మాటికీ వెర్రితనమని చెప్పారు. 
trump
democrats
mexico
america
boarder
wall

More Telugu News