balakrishna: 100 అడుగుల 'కథానాయకుడు' కటౌట్

  • ఎన్టీఆర్ సినీ జీవితంగా 'కథానాయకుడు'
  • బాలకృష్ణ గెటప్స్ ప్రధాన ఆకర్షణ 
  • జనవరి 9వ తేదీన విడుదల  

ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా రూపొందుతోంది. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన విశేషాలతో 'కథానాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ తో వున్న బాలకృష్ణ 100 అడుగుల కటౌట్ ను హైదరాబాద్ - నిజాంపేట్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేశారు.

 భారీ కటౌట్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ ధరించిన వివిధ రకాల గెటప్స్ .. కీరవాణి సంగీతం .. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నందమూరి అభిమానులంతా ఈ సినిమా విడుదల తేదీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News