naresh: జంధ్యాల గారు చనిపోవడం నా జీవితంలో అత్యంత విషాదం: సీనియర్ నరేశ్

  • జంధ్యాల గారు నన్ను కొడుకుగా భావించారు
  • ఆయన వల్లనే హీరోగా నిలదొక్కుకున్నాను
  • జంధ్యాల గారు చనిపోవడం నన్ను ఎంతో బాధించింది    

హాస్య కథానాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నరేశ్, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ దర్శకుడు జంధ్యాల గురించి ప్రస్తావించారు."నా 17వ యేట నేను జంధ్యాల గారిని కలుసుకున్నాను. అప్పటి నుంచి నన్ను ఆయన ఒక స్నేహితుడిగానే చూశారు. జంధ్యాల గారు నాతో వరుసగా సినిమాలు చేయడం వలన నేను హీరోగా నిలదొక్కుకోగలిగాను .. లేదంటే నా కెరియర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోయేది.

దర్శకుడిగా ఆయనకి .. హీరోగా నాకు అవకాశాలు ఒకేసారి తగ్గిపోవడంతో, మా ఇద్దరి మధ్యా అనుబంధం మరింత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన చనిపోయారు. నా జీవితంలో అంతటి విషాదాన్ని నేను ఫేస్ చేయలేదు. ఆయనకి చాలా ఆలస్యంగా సంతానం కలిగింది. సాహితి .. సంపద అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఒకరోజున వాళ్లిద్దరినీ కార్లో వెనక సీట్లో కూర్చోబెట్టుకుని, నా కొడుకు లేకపోతే ఎలా అంటూ నన్ను ముందు సీట్లో కూర్చోమన్నారు. నా పట్ల అంత ప్రేమ చూపారు గనుకనే, ఇప్పటికీ ప్రతి షాట్ కి ముందు ఆయనని తలచుకుంటాను" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News