Jana Sena: పార్టీ చిహ్నం కోసం ఎన్నికల సంఘానికి మూడు గుర్తులను పంపిన జనసేన!

  • తొలి చాయిస్ గా పిడికిలిని కోరుకున్న జనసేన అధినేత
  • మరో చాయిస్ గా బకెట్ ను ఎంచుకున్న పవన్
  • గాజు గ్లాస్ ను ఖాయం చేసిన ఎన్నికల కమిషన్

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి గాజు గ్లాస్ ను గుర్తుగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదైనా పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించే ముందు మూడు చాయిస్ లను కోరుకోవాలని ఈసీ చెబుతుంది. ఇక జనసేన పార్టీ సైతం మూడు గుర్తులను ఎంపిక చేసి ఈసీకి పంపించింది. అవి ఏంటో తెలుసా?

జనసేన అధినేత తొలి చాయిస్ గా పిడికిలి గుర్తు కావాలని కోరారు. పవన్ తన అభివాదంగా పిడికిలిని చూపిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ గుర్తు లభిస్తే, ప్రజలకు సులువుగా గుర్తుంటుందని పవన్ భావించారు. రెండో చాయిస్ గా గాజు గ్లాస్ ను, మూడో చాయిస్ గా బకెట్ గుర్తును ఆయన కోరుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన జనసేన పార్టీ సేవాదళ్‌ కడప జిల్లా సమన్వయకర్త రంజిత్‌ కుమార్‌, గాజు గ్లాస్ రావడంతో ఇతర పార్టీల్లో గుబులు పుడుతోందని అన్నారు. గ్రామాల్లో ఉండే పేదల నుంచి పట్టణాల్లో ఉండే ప్రతి ఒక్కరికి గాజు గ్లాసుతో సంబంధం ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

More Telugu News