Akhil: మూడు నెలల నరకం తరువాత ఇలా... అదిరిపోతున్న అక్కినేని అఖిల్ ఫొటో!

  • 'మిస్టర్ మజ్ఞు'గా రానున్న అఖిల్
  • సినిమా కోసం 6 ప్యాక్ బాడీ
  • ట్విట్టర్ లో ఫోటోను పోస్ట్ చేసిన అఖిల్

ఘనమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఇప్పటివరకూ సరైన హిట్ కొట్టలేకపోయిన అక్కినేని అఖిల్, తన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ఞు'తో మరోసారి వెండి తెరలను పలకరించనున్నాడు. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ నేటి సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో విడుదల కానుండగా, ఈ విషయాన్ని చెబుతూ అఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్టిల్ ను ఉంచాడు.

ఇందులో అఖిల్ 6 ప్యాక్ బాడీతో అదిరిపోతున్నాడని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. "ఇందుకోసం నేనెంతో కష్టపడ్డాను. మూడు నెల నరకం. కానీ ఇప్పుడు అది స్వర్గమనే అనుకుంటున్నా. ఇందుకు నా ట్రయినర్ దిలీప్ కు కృతజ్ఞతలు. నువ్వు లేకుండా ఈ పని చేసుండలేను" అని వ్యాఖ్యానించాడు.




More Telugu News