tanikella bharani: నన్ను ఎందుకు తీసేసింది వర్మ మా ఇంటికి వచ్చి మరీ చెప్పాడు: తనికెళ్ల భరణి

  • 'శివ' సినిమాకి మాటలు రాశాను
  • స్క్రిప్ట్ వర్మకి పంపించాను
  •  ఆయన నుంచి ఫోన్ లేదు  

అనేక చిత్రాలకి సంభాషణలు సమకూర్చిన తనికెళ్ల భరణి, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'శివ' సినిమాను గురించి ప్రస్తావించారు. "నేను 'శివ' సినిమాకి మాటలు రాసి వర్మకి వినిపించాను. కాలేజ్ నేపథ్యంలో కథ కావడంతో చాలా జోక్స్ రాశాను. ఒక్క జోక్ కూడా ఉండటానికి వీల్లేదని వర్మ చెప్పాడు.

ఆ తరువాత ఆయనకి కావలసినట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి, సీవీఎల్ నరసింహారావుకు ఇచ్చి పంపించాను. నేను వేరే చోటుకి అత్యవసరంగా వెళ్లవలసి రావడంతో అలా చేశాను. అప్పటి నుంచి నాకు ఫోన్ కాల్ లేదు .. కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లో నా పేరు లేదు. నాకు కాస్త బాధగానే అనిపించింది. కో డైరెక్టర్ నాగేశ్వరరావు నాకు ఫోన్ చేసి వర్మని ఒకసారి కలవమన్నారు. నేను వర్మకి ఫోన్ చేస్తే .. దగ్గర్లోనే వున్నానని చెప్పి మా ఇంటికి వచ్చాడు.

టీ కావాలని వర్మ అడిగితే ఇచ్చాను. టీ తాగుతూ 'భరణి నిన్ను తీసేశాను తెలుసా?' అన్నాడు. 'తెలుసు సార్ .. సంతోషించాను' అన్నాను. 'ఎందుకు తీసేశానో తెలుసా?' అన్నాడు. 'తెలియదు సార్ .. అన్నాను. ఎంతో ముఖ్యమైన స్క్రిప్ట్ ను నువ్వు వేరేవాళ్లతో పంపించడం తప్పా? కాదా? అన్నాడు. పొరపాటే .. కానీ అంటూ కారణం చెప్పాను. 'రెండవ పొరపాటు .. ఈ కథను నువ్వు వేరేవాళ్లకి చెప్పడం' అన్నాడు. దానికి నేను 'అసలు మన సినిమాలో కథ వుందా సార్' అన్నాను. అంతే .. ఆయన పెద్దగా నవ్వేశాడు' అంటూ చెప్పుకొచ్చారు.       

  • Loading...

More Telugu News