sensex: క్రిస్మస్ సందర్భంగా ప్రాఫిట్ బుకింగ్.. నష్టాల్లో మార్కెట్లు

  • అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు
  • 271 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు, క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లకు సెలవులు ఉండటంతో... ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు కోల్పోయి 35,470కి పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి 10,663 వద్ద స్థిర పడింది.

టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (4.89%), ఎంఫాసిస్ (4.69%), ఆర్ఈసీ (3.75%), ఐనాక్స్ లీజర్ (3.39%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.12%).      

టాప్ లూజర్స్:
ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ (-8.42%), జైప్రకాశ్ అసోసియేట్స్ (-7.48%), జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ (-7.24%), అవెన్యూ సూపర్ మార్కెట్స్ (-5.54%), హెచ్ఈజీ లిమిటెడ్ (-5.53%).

More Telugu News