nawaz shariff: మరో కేసులో నవాజ్ షరీఫ్ కి ఏడేళ్ల జైలు శిక్ష

  • సౌదీలోని స్టీల్ మిల్ కేసులో శిక్ష
  • ఆదాయ వనరులను చూపించలేకపోయారంటూ జియో న్యూస్ కథనం
  • గతంలో పదేళ్ల జైలు శిక్షను విధించిన అదే కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అక్కడి అవినీతి నిరోధక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. సౌదీ అరేబియాలోని స్టీల్ మిల్ ఓనర్ షిప్ కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేక పోయారని ఈ సందర్భంగా జియో న్యూస్ తెలిపింది. జూలై 10న ఇదే కోర్టు షరీఫ్ కు పదేళ్ల జైలు శిక్షను విధించింది. అవినీతి సొమ్ముతో లండన్ లో విలాసవంతమైన ఫ్లాట్స్ కొనుగోలు చేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. ఇప్పుడు అదే కోర్టు షరీఫ్ కు మళ్లీ షాకిచ్చింది.

More Telugu News