Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పోలవరం నిర్మాణం వద్దనుకుంటున్నారా?: వైసీపీపై మంత్రి ప్రత్తిపాటి ఫైర్

  • కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదు
  • దమ్ముంటే సంక్షేమ పథకాలపై చర్చకు రండి
  • 150 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం

ఆంధ్రుల రాజధాని అమరావతికి నిధులు ఇవ్వకపోవడంపై జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తుంటే, వైసీపీ నేతలు బ్లాక్ పేపర్లు జారీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 150 సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పోలవరం నిర్మాణం వద్దని కోరుకుంటున్నారా? అని వైసీపీ నేతలను పుల్లారావు ప్రశ్నించారు. దేశంలోనే భారీ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని మంత్రి స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాలు విసిరారు.

 త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ఎవరితో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

More Telugu News