BJP: తెలంగాణలో ఓటమిపై భారతీయ జనతా పార్టీ స్వీయ సమీక్ష

  • ఓటమి కారణాల విశ్లేషణతోపాటు భవిష్యత్తు ఎన్నికల్లో గెలుపుపై చర్చ
  • రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి నడ్డా ఆధ్వర్యంలో సమావేశం
  • హాజరైన రాష్ట్రంలోని పార్టీ సీనియర్లు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఘోరపరాజయం పాలవ్వడానికి కారణాలపై భారతీయ జనతా పార్టీ స్వీయ సమీక్ష మొదలుపెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జెపీ నడ్డా ఆధ్వర్యంలో నేడు ప్రారంభమైన సమావేశానికి రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్లు, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు భవిష్యత్తులో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకునేందుకు ఏం చేయాలన్న దానిపై కూలంకుషంగా చర్చించనున్నారు. 
BJP
Telangana Assembly Election

More Telugu News