Telangana: కేసీఆర్ ఓ జీరో.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి ప్రధాన్!

  • సున్నా, సున్నా కలిస్తే వచ్చేది జీరోనే
  • ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్ర మంత్రి వ్యాఖ్య
  • నవీన్ పట్నాయక్ ను కలిసిన కేసీఆర్
జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రతిపాదనకు మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. కాగా మిగతా పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలతో తమకు వచ్చే నష్టం ఏమీ లేదని ప్రధాన్ తెలిపారు. కేసీఆర్ వల్ల ఎన్నికల ఫలితాలు ప్రభావితం కాబోవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఆయన జీరోగా అభివర్ణించారు. ‘ఓ సున్నా ఇంకో సున్నాతో కలిస్తే మిగిలేది కూడా సున్నానే’ అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Telangana
KCR
TRS
BJP
Odisha
naveen
Chief Minister
zero

More Telugu News