Telangana: హీరో ప్రభాస్ భూ ఆక్రమణదారుడే... స్పష్టం చేసిన తెలంగాణ సర్కారు!

  • ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ప్రభాస్
  • అందుకనే స్వాధీనం చేసుకున్నాం
  • హైకోర్టుకు రెవెన్యూ అధికారుల నివేదిక

యువ హీరో ప్రభాస్, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, అందులో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని, అందువల్లే తాము దాన్ని సీజ్ చేయాల్సి వచ్చిందని తెలంగాణ రెవెన్యూ అధికారులు, సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో, సర్వే నంబర్‌ 5/3లో ప్రభాస్‌ కు చెందిన 2,083 చదరపు అడుగుల స్థలాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని చెబుతూ, అందుకు గల కారణాలను తమ పిటిషన్ లో వెల్లడించారు.

దీంతో ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, కేసు విచారణను 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, తాను ఈ స్థలాన్ని చట్టబద్ధంగా కొన్నానని, రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రభాస్, హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలోని తన భవంతికి ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నానని, ఎటువంటి వివాదాలు లేకపోయినా, తాను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నానని, రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ కోరుతున్నారు.

More Telugu News