ARMY: మహిళా అధికారిని వేధించిన ఆర్మీ మేజర్.. డిస్మిస్ చేసి ఇంటికి పంపిన సైన్యం!

  • కెప్టెన్ ను వేధించిన మేజర్ జస్వాల్
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసిన అధికారిణి
  • తనను బలిచేశారని ఆరోపించిన మేజర్

భారత సైన్యంలో పనిచేస్తున్న ఓ కామాంధుడి తిక్క కుదిరింది. ఓ మహిళా ఉద్యోగినిని వేధించిన కేసులో ఆయన్ను విధుల నుంచి డిస్మిస్ చేస్తూ ఆర్మీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. భారత సైన్యంలో ఎంఎస్‌ జస్వాల్‌ మేజర్ జనరల్ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆయన్ను అధికారులు నాగాలాండ్ కు బదిలీ చేశారు.

ఈ క్రమంలో అక్కడే తన కింద పనిచేస్తున్న కెప్టెన్ స్థాయి అధికారిణిని తన ఆఫీసుకు జస్వాల్ పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఆర్మీ జనరల్‌ కోర్టు మార్షల్‌ (జీసీఎం).. జస్వాల్ ను విధుల నుంచి సాగనంపుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్గత వర్గపోరులో భాగంగా తనను బలిచేశారనీ, దీనిపై ఎగువ కోర్టులో అప్పీల్ చేస్తానని జస్వాల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News