భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల!

  • వరుస సెలవులతో తరలివస్తున్న భక్తులు
  • ఉచిత దర్శనానికి 24 గంటల సమయం
  • ఆదివారం హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో గత వారాంతాన ఉన్న రద్దీ, సోమవారం నాడూ కొనసాగుతోంది. మంగళవారం కూడా సెలవు వుండటంతోనే తిరుమలకు భక్తుల రాక అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌ మెంట్లూ నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 24 గంటలకు పైగానే సమయం పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు భక్తులు, స్వామిని దర్శించుకోకుండానే వెనుదిరిగి వెళుతున్నారు. కాగా, ఆదివారం నాడు స్వామివారికి హుండీ ద్వారా రూ. 3.24 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News