Actor: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. స్పష్టతనిచ్చిన సినీ నటుడు విశాల్

  • అరెస్ట్ చేయడం షాక్‌కు గురిచేసింది
  • నేను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యా
  • ఆ ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలపై తమిళ సినీ నటుడు విశాల్ స్పందించాడు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని, పోటీ చేయడం లేదని స్పష్టం చేశాడు. నిర్మాతల మండలిలో ఇటీవల ఏర్పడిన విభేదాల గురించి మాట్లాడుతూ.. పోలీసులు తనను అరెస్ట్ చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు. తన ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.

టీఎఫ్‌పీసీకి తాను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యానన్న విశాల్ తనను ఆపే అధికారం ఎవరికీ లేదన్నాడు. తనను దెబ్బతీసేందుకు సంఘం నిధులు దుర్వినియోగం చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. నిధుల వినియోగానికి సంబంధించి ప్రతీదీ రికార్డెడ్‌గా ఉందని, ఇటువంటి ఆరోపణలు విన్నప్పుడల్లా నవ్వొస్తుందని విశాల్ పేర్కొన్నాడు.
Actor
Vishal
Tamil Nadu
Kollywood
TFPC
arrest

More Telugu News