kcr: మార్పు వైపు తొలి అడుగు పడింది: కేసీఆర్

  • ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాం
  • దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళతాం
  • ఇరువురం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించాం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలను ప్రారంభించామని తెలిపారు. దేశం గురించి ఏదైనా చేయాలని నవీన్ పట్నాయక్ తనతో అన్నారని చెప్పారు. దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలతో కలసి ముందుకెళతామని తెలిపారు.

దేశవ్యాప్తంగా పలువురు నేతలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం చర్చలు మొదలయ్యాయని, తొలి అడుగు పడిందని తెలిపారు. వ్యవసాయరంగ అభివృద్దికి నవీన్ పట్నాయక్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రైతుబంధులాంటి పథకాన్ని ఒడిశాలో అమలు చేస్తుండటం సంతోషకరమని చెప్పారు. తాము ఎవరికీ తోక పార్టీలం కాదని చెప్పారు. త్వరలోనే ఇరువురం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించామని తెలిపారు.

More Telugu News