nasiruddin shah: సైన్యంపై రాళ్లతో దాడి చేసేంత స్వేచ్ఛ మన దేశంలో ఉంది.. ఇంకెంత స్వేచ్ఛ కావాలి?: నసీరుద్దీన్ షాపై అనుపమ్ ఖేర్ ఫైర్

  • దేశంలో స్వేచ్ఛ లేదన్న నసీరుద్దీన్ షా
  • తన పిల్లల గురించి భయపడుతున్నానంటూ వ్యాఖ్య
  • తీవ్రంగా స్పందించిన అనుపమ్ ఖేర్

దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేదని... మతం విషయంలో తన పిల్లల గురించి భయపడుతున్నానంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మనుషుల ప్రాణాల కంటే జంతువుల ప్రాణాలే ఎక్కువయ్యాయని... మతం, గోరక్షణ పేరుతో మూకదాడులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై మరో సినీ నటుడు అనుపమ్ ఖేర్ మండిపడ్డారు.

నసీరుద్దీన్ కు ఇంకెంత స్వేచ్ఛ కావాలని అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు. సైన్యాన్ని నోటికొచ్చినట్టు తిట్టేంత, వారిపై రాళ్లతో దాడి చేసేంత స్వేచ్ఛ మన దేశంలో ఉందని అన్నారు. నసీరుద్దీన్ ఏదో మాట్లాడినంత మాత్రాన అదంతా నిజం కాబోదని చెప్పారు. గతంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కశ్మీరీ పండిట్స్ విషయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

More Telugu News