mithun reddy: వైసీపీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు: మిథున్ రెడ్డి

  • రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయం
  • అధికార బలం, పోలీసుల అండతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది
  • వైసీపీలో చేరాలనుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించారు
రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని... వైసీపీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అధికార బలం, పోలీసుల అండతో అనైతిక చర్యలకు టీడీపీ పాల్పడుతోందని విమర్శించారు.

నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సొంత పంచాయతీ అయిన పత్తేగడలోని బాలయ్యకుంట వడ్డిపల్లె గ్రామస్తులు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధమైతే... వారిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అందుకే తామే అక్కడకు వెళ్లి గ్రామస్తులను పార్టీలోకి ఆహ్వానించాలనుకున్నామని చెప్పారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి చిత్తూరు జిల్లా కలికిరిలో వైసీపీ శ్రేణులు ర్యాలీ, బహిరంగసభను నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలయ్యకుంట వడ్డిపల్లెకు చెందిన పలువురికి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.
mithun reddy
ysrcp
kalikiri
tcp
nallari kishor kumar reddy

More Telugu News