KCR: విశాఖపట్నం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. 'జై కేసీఆర్' నినాదాలతో మార్మోగిన ఎయిర్ పోర్టు!

  • గులాబీమయమైన రహదారి
  • శారదా పీఠానికి ప్రయాణం
  • ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నంకు చేరుకున్నారు. విశాఖపట్నంలో దిగిన కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది. కేసీఆర్ రాక నేపథ్యంలో ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠం వరకూ రోడ్లు గులాబీమయం అయ్యాయి. స్థానిక నేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం నేటి నుంచి 3 రోజుల పాటు కేసీఆర్ దేశమంతా పర్యటించనున్నారు.

ఈరోజు ఉదయం ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే అభిమానులు.. జై కేసీఆర్, జైజై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి అభివాదం చేశారు. అనంతరం కుటుంబసభ్యులతో పాటు పార్టీ నేతలు సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో కలిసి కారులో శారదా పీఠానికి బయలుదేరారు. కాగా, కేసీఆర్ పర్యటన  నేపథ్యంలో పీఠంతో పాటు కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఏపీ ప్రభుత్వం గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. వీరికి అదనంగా తెలంగాణ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ బలగాలు ఇక్కడకు చేరుకున్నాయి.
KCR
Visakhapatnam District
Andhra Pradesh
Telangana
tour

More Telugu News