KCR: ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరాలి : హోదా పోరాట సమితి లేఖ

  • టీఆర్‌ఎస్‌ అధినేత ఆంధ్ర పర్యటన సందర్భంగా విడుదల
  • ఏపీ ప్రజల మేలుకు కేసీఆర్‌ సహకరించాలి
  • ప్రాజెక్టులు, నిరుద్యోగుల విషయంలో వ్యతిరేకతకు స్వస్తి పలకాలని వినతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక హోదా పోరాట సమితి లేఖలో కోరింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేసీఆర్‌ వస్తున్న నేపథ్యంలో ఆదివారం విశాఖలో సమితి ఈ లేఖ విడుదల చేసింది.

 ఇప్పటి వరకు కేసీఆర్‌ అన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌ పట్ల తన వ్యతిరేకత చాటుకున్నారని, ముఖ్యంగా ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణంలో అడ్డుపుల్లలు వేస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చర్యలు ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇకపై ఇటువంటి విధానాలకు స్వస్తి పలికి ఆంధ్రప్రజలకు మేలుచేసే చర్యలకు ఒడిగట్టాలని లేఖలో సమితి కోరింది.

  • Loading...

More Telugu News