agri gold: కేంద్రం వైఖరిని ప్రజలకు తెలియజేస్తాం..శ్వేతపత్రాలు విడుదల చేస్తాం: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదు 
  • కేంద్ర నిధులు దుర్వినియోగమవుతున్నాయనడం తగదు
  • ‘అగ్రిగోల్డ్’ వ్యవహారంలో వైసీపీ కావాలనే బురద జల్లుతోంది

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ సహకరించడం లేదని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకు రేపటి నుంచి పది రోజుల పాటు నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని వెల్లడించారు. తిత్లీ తుపాన్ కు సంబంధించిన నష్టపరిహారం కోరినంత ఇవ్వని కేంద్రం, ఏపీలో నిధులు దుర్వినియోగం చేశారంటూ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
 
ఈ సందర్భంగా ‘అగ్రిగోల్డ్’ వ్యవహారంలో వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం ఉందంటూ వారు   కావాలనే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అగ్రిగోల్డ్’ విషయంలో రాజకీయాలు చేయడం తగదని అన్నారు. అగ్రిగోల్డ్’ పై కోర్టు ఆదేశాలతో టీడీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయిందని అన్నారు. కోర్టుకు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నెల 28న ధర్నాకు పిలుపు నిచ్చిన పార్టీలు, బాధితులు ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. రేపటి నుంచి పది రోజుల పాటు నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని వెల్లడించారు.  

  • Loading...

More Telugu News