Russia: సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ ఉండదు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్టయిలే వేరు!

  • సమాచార చౌర్యం, నిఘా నేపథ్యంలో నిర్ణయం
  • వ్యక్తిగత సమాచారం భద్రతపై జాగ్రత్తలు
  • మీడియాతో అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రి

శత్రువులను ఇబ్బంది పెట్టడం, మిత్రులను ఆదుకోవడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్టయిలే వేరు. అమెరికాకు చేరువైన ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, సిరియా అధ్యక్షుడు అసద్ కోసం ఏకంగా సొంత సైన్యాన్ని పంపడం అందులో మచ్చుకు కొన్ని. తాజాగా పుతిన్ గురించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ వ్యక్తిగతంగా అసలు సెల్ ఫోన్ నే వాడరట. ముఖ్యమైన సమాచారం తెలుసుకునేందుకు కూడా ఆయన డాక్యుమెంట్లపైనే ఆధారపడతారు. ఇక పుతిన్ వ్యక్తిగత కార్యాలయంలో వాడే కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు.

సమాచార చౌర్యంతో పాటు నిఘా పెట్టకుండా ఉండేందుకే పుతిన్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. సెల్ ఫోన్ తో పాటు ఇంటర్నెట్ కారణంగా సున్నితమైన సమాచారం బయటకు పొక్కే అవకాశముందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ కంప్యూటర్‌పైనైనా నిఘా పెట్టేందుకు 10 దర్యాప్తు సంస్థలకు అధికారాలు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

More Telugu News