జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు చావుదెబ్బ.. ఆరుగురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ!
- పూల్వామా జిల్లా త్రాల్ లో ఎన్ కౌంటర్
- కాల్పులు జరుపుతూ పరారైన ఉగ్రవాదులు
- ఇంకా కొనసాగుతున్న ఎన్ కౌంటర్
అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు నక్కిన ఇంటి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.