Rahul Gandhi: సిమ్లాలో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ!

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తీరికలేకుండా గడిపిన రాహుల్
  • విహారయాత్రకు హిమాచల్‌ప్రదేశ్
  • దివ్యాంగ విద్యార్థులతో కలిసి చెస్ ఆడిన కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌లో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పర్యటనలతో క్షణం తీరిక లేకుండా గడిపిన ఆయన రాజకీయాలకు కొన్ని రోజుల విరామం ప్రకటించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం హిమాచల్‌ప్రదేశ్ వెళ్లిన ఆయన సిమ్లాలో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడి దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు చెస్ ఆడుతూ ముచ్చటించారు. విద్యార్థులతో రాహుల్ చెస్ ఆడుతుండగా ఆయన సోదరి ప్రియాంక వాద్రా ఫొటో తీశారు. సిమ్లాలో నిర్మిస్తున్న ప్రియాంక ఇంటిని రాహుల్ పరిశీలించారు. సిమ్లా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో రాహుల్ ఓ దాబా వద్ద ఆగినప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనను కలుసుకున్నారు.
Rahul Gandhi
Himachal Pradesh
shimla
priyanka vadra
Congress

More Telugu News