Rahul Gandhi: దేశ భద్రతపై రాజకీయాలా?: రాహుల్ గాంధీపై అమిత్ షా నిప్పులు

  • దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు
  • ప్రభుత్వ ఉత్తర్వులపై విపక్షాల ఆందోళన
  • ప్రజల్లో రాహుల్ భయాందోళనలు సృష్టిస్తున్నారన్న అమిత్ షా
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ చీఫ్ అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశ భద్రతపై ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సహా పది దర్యాప్తు సంస్థలు ఏ కంప్యూటర్ నుంచైనా సమాచారాన్ని నియంత్రించేలా గురువారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్ విమర్శలపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశ భద్రతపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశాస్త్రీయ నిఘా నియంత్రణకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మోదీ ఆ పనిచేస్తుంటే రాహుల్ ఓర్వ లేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
Rahul Gandhi
Amit Shah
CBI
NIA
NDA
UPA
Narendra Modi
BJP

More Telugu News