Chandrababu: టీచర్లు, పోలీసుల పదోన్నతులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

  • చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీట్
  • కొత్త మంత్రుల పేషీలో 16 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
  • ఆదరణ పథకం సబ్సిడీ 90 శాతానికి పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధ్యాయులు, పోలీసుల పదోన్నతులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కొత్తగా కేబినెట్‌లో చేరిన కిడారి శ్రవణ్, ఫరూక్ పేషీలో 16 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెడ్ కానిస్టేబుళ్ల పోస్టులకు, పోలీసుల పదోన్నతులకు ఆమోదం తెలపడంతోపాటు 566 ఏఎస్ఐ పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.  

ఆదరణ-2 కార్యక్రమం కింద పొందుతున్న సబ్సిడీని 70 శాతం నుంచి 90 శాతానికి  పెంచుతూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం అదనపు సబ్సిడీ వల్ల ప్రభుత్వంపై రూ.195 కోట్ల భారం పడుతుంది. అయితే, 8 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.  

More Telugu News