vikram kumar: అందులో ఎంతమాత్రం నిజం లేదు: దర్శకుడు విక్రమ్ కుమార్

  • 'జెర్సీ' సినిమాతో నాని 
  • తదుపరి సినిమా విక్రమ్ కుమార్ తో
  • త్వరలో సెట్స్ పైకి               

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే విక్రమ్ కుమార్ కసరత్తు చేస్తున్నాడు. అయితే ఈ స్క్రిప్ట్ వర్క్ లో నాని పాలుపంచుకుంటున్నాడనీ, ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ లో వేలు పెట్టేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ ప్రచారం ఊపందుకుంటూ ఉండటంతో, తాజాగా విక్రమ్ కుమార్ స్పందించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని ఎంతమాత్రం జోక్యం చేసుకోవడం లేదనీ, స్క్రిప్ట్ పనుల్లో నాని తల దూరుస్తున్నాడనే ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని స్పష్టం చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్లాన్ చేసుకున్న ప్రకారం జరుగుతున్నాయనీ, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అన్నాడు. ఆ విధంగా, జరుగుతున్న ప్రచారానికి విక్రమ్ కుమార్ తెరదించేశాడన్నమాట. 

More Telugu News