amaravathi: అమరావతిలో అడుగు పెట్టబోయే మోదీకి ఘాటైన సమాధానం చెబుతాం!: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • కేంద్రాన్ని నిలదీసేందుకే ధర్మపోరాట దీక్షలు 
  • శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తాం
  • ప్రజాస్వామ్యబద్ధంగానే కేంద్రాన్ని ఎదుర్కొంటాం
వచ్చే నెల 6న ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో అడుగు పెట్టబోయే మోదీకి ఘాటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రాన్ని నిలదీసేందుకే ధర్మపోరాట దీక్షలు చేస్తున్నామని, లక్ష మంది ప్రజలతో శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికలకు సిక్కోలు ధర్మపోరాట దీక్ష దిశానిర్దేశం చేస్తుందని, ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపైనా గళమెత్తుతామని స్పష్టం చేశారు. విభజన చట్టాన్ని అమలు  చేయాలన్న డిమాండుతో ధర్మపోరాట దీక్షలు కొనసాగిస్తామని, ప్రజాస్వామ్యబద్ధంగానే కేంద్రాన్ని ఎదుర్కొంటామని చెప్పారు.
amaravathi
Telugudesam
rammohan naidu

More Telugu News