hameed ansari: ప్రియురాలి కోసం వెళ్లి పాక్ జైల్లో ఆరేళ్లు గడిపిన టెక్కీ.. యువతకు సందేశం

  • తల్లిదండ్రుల వద్ద ఏదీ దాయవద్దు
  • ప్రేమలో పడి రిస్క్ తీసుకోవద్దు
  • అక్రమ పద్ధతులతో ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దు

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించి, ఆమె కోసం సరిహద్దులను దాటి పాకిస్థాన్ కు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హమీద్ అన్సారీ... అక్కడ ఆరేళ్ల జైలు జీవితం గడిపి, ఇటీవలే విడుదలయ్యాడు. ఈ సందర్భంగా యువతకు అతను ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఫేస్ బుక్ ద్వారా ప్రేమలో పడకండని సూచించాడు. 'మీ తల్లిదండ్రుల వద్ద ఏదీ దాయవద్దు. కష్ట కాలంలో మీకు తోడుండేది తల్లదండ్రులే. ఫేస్ బుక్ ను నమ్మి ప్రేమలో పడవద్దు. రిస్క్ తీసుకోవద్దు. అక్రమ పద్ధతులలో ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దు' అంటూ యువతకు సూచించాడు.

తాను పాకిస్థాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నాననే వార్త వినగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని అన్సారీ చెప్పాడు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు జైలు సూపరింటెండెంట్ తన వద్దకు వచ్చారని... అరగంటలో రెడీ అవ్వు అని చెప్పారని తెలిపాడు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే దుస్తులు మార్చుకుని, షూస్ వేసుకుని, వాహనంలో కూర్చున్నానని చెప్పాడు.

పాకిస్థాన్ కు చెందిన అమ్మాయితో ముంబైకి చెందిన అన్సారీకి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారనే వార్తను తెలుసుకుని, ఆమెను కాపాడేందుకు ఆఫ్ఘనిస్థాన్ గుండా పాకిస్థాన్ లోకి అడుగుపెట్టాడు. పాక్ సైన్యం చేతికి చిక్కాడు. అనంతరం గూఢచర్యం ఆరోపణలతో అన్సారీకి జైలు శిక్ష విధించారు. మంగళవారం నాడు వాఘా-అట్టారి బోర్డర్ లో అతన్ని భారత అధికారులకు పాక్ అధికారులు అప్పగించారు.  

More Telugu News