sumanth ashwin: మరింత భయపెట్టేస్తోన్న 'ప్రేమకథా చిత్రం 2' టీజర్

  • సుమంత్ అశ్విన్ హీరోగా హారర్ థ్రిల్లర్ 
  • మరోసారి దెయ్యం పాత్రలో నందిత శ్వేత 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    

సుధీర్ బాబు హీరోగా గతంలో వచ్చిన 'ప్రేమకథా చిత్రం' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'ప్రేమకథాచిత్రం 2' వస్తోంది. సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా ఈ సినిమాను దర్శకుడు హరికిషన్ రూపొందించాడు. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ నుంచి తాజాగా టీజర్ ను వదిలారు.

ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. హారర్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందిత శ్వేత, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించి భయపెట్టేది ఆమెనే. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ప్రేమకథా చిత్రం' మాదిరిగానే ఈ సీక్వెల్ కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.

More Telugu News