YSRCP: నేడు జగన్ పుట్టిన రోజు.. ఫేస్ బుక్ లో స్పందించిన రోజా!

  • ప్రజాసేవ కోసం తపించే నేత జగన్
  • ఆయన రాజన్న రాజ్య రథసారథి అని కితాబు
  • ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేసిన రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు వైఎస్ జగన్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నిమిషం ప్రజాసేవకు తపించే వ్యక్తి జగన్ అని ఆమె కొనియాడారు. రాజన్న రాజ్య రథసారథి, ప్రజలందరి ఆప్తుడైన జగనన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు ఫేస్ బుక్ లో రోజా స్పందిస్తూ..‘ప్రతి నిమిషం ప్రజాసేవ కోసం తపించే రాజన్నరాజ్య రథసారథి, మన నాయకుడు, ప్రజలందరి ఆప్తుడు మన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
YSRCP
Jagan
BIRTHDAY
ROJA
Facebook

More Telugu News