NDA: ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నాం ..విపక్షాల కూటమిలో చేరాం: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహ

షార్ట్స్‌లో చూడండి
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్ సమత పార్టీ (ఆర్ఎస్ఎల్పీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ నుంచి వైదొలగుతున్నట్టు ఆర్ఎస్ఎల్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహ వెల్లడించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడనున్న విపక్షాల కూటమిలో తాము కూడా చేరినట్టు ప్రకటించారు.

విపక్షాల కూటమిలోకి తమను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రజల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రాష్ట్రంలో సామాజిక న్యాయం కావాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తానన్న ప్రధాని మోదీ తన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కాగా, ఆర్ఎస్ఎల్పీ చేరికను కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు ఆ కూటమిలోని మిగిలిన పార్టీల నేతలు ఆహ్వానించారు. 
Go Back to Shorts
NDA
kutami
Rslp
kushwaha
congress

More Telugu News