Ramcharan: కంగారులో రాంచరణ్ కు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా: లావణ్య త్రిపాఠి

  • ఫంక్షన్ లో కాస్త కంగారుగా ఉన్నాను
  • వేడుకకు విచ్చేసిన చరణ్ కు థ్యాంక్స్
  • చరణ్ రావడంతో మాలోని స్థైర్యం మరింత పెరిగింది
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఆదితి రావు హైదరిలు ప్రధాన పాత్రలు పోషించిన 'అంతరిక్షం' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక నిన్న అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాంచరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా వేదికపై లావణ్య మాట్లాడుతూ, అందరి గురించి ప్రస్తావించింది. కానీ, రాంచరణ్ కు ధన్యవాదాలు చెప్పడం మాత్రం మర్చిపోయిందట.

ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా లావణ్య స్పందిస్తూ, ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తాను కాస్త కంగారుగా ఉన్నానని తెలిపింది. ఈ కంగారులోనే రాంచరణ్ కు ధన్యవాదాలు తెలపడం మర్చిపోయానని... వేడుకకు విచ్చేసిన చరణ్ కు థ్యాంక్స్ చెబుతున్నానని ట్వీట్ చేసింది. వేడుకకు చరణ్ హాజరుకావడం తమలోని స్థైర్యాన్ని మరింత పెంచిందని తెలిపింది.
Ramcharan
lavanya tripathi
varun tej
antariksham
pre release

More Telugu News