Karnataka: మారెమ్మ ఆలయం విష ప్రసాదం కేసు.. 15 బాటిళ్ల పురుగుల మందు కలిపారు!

  • చామరాజనగర జిల్లా సుళవాడిలోని మారెమ్మ ఆలయం
  • ఈ దారుణానికి పాల్పడింది ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడే
  • ప్రసాదం తయారీ సమయంలో పురుగుల మందు కలిపారు: పోలీసులు

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళవాడిలోని మారెమ్మ ఆలయం ప్రసాదంలో విషం కలిపిన సంఘటన జరిగి వారం రోజులు  అవుతోంది. ఈ ఘటనలో 15 మంది  భక్తులు మృతి చెందగా, వంద మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. కాగా, ఓ వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రసాదంలో పురుగుల మందు కలిపారన్న అనుమానంతో వారిని పోలీసులు నిన్న అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు.. మారెమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేశ్వరస్వామి అలియాస్ దేవన్న మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డట్టు చెప్పారు. కొంత కాలంగా ట్రస్టు యాజమాన్యంతో దేవన్నకు అంతర్గత కలహాలున్నాయని, వారికి చెడ్డపేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రసాదంలో పురుగు మందు కలిపినట్టు అంగీకరించాడని చెప్పారు.

 ప్రసాదం తయారు చేసే సమయంలో పదిహేను బాటిళ్ల పురుగుల మందును కలిపినట్టు నిందితులు చెప్పారని అన్నారు. ఈ పురుగుల మందు గాఢత ఎక్కువగా ఉన్నందువల్లే ఆ ప్రసాదం తిన్న భక్తులు మృతి చెందారని పోలీసులు చెప్పారు. 2017 నుంచి మారెమ్మ ఆలయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దేవన్, ప్రసాదంలో పురుగుల మందు కలిపేందుకు చాలా రోజులుగా పథక రచన చేశాడని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News