Dayakar rao: ఎర్రబెల్లి దయాకర్ రావుకు అంత మెజార్టీ ఎందుకొచ్చిందంటే..!: కేటీఆర్ విశ్లేషణ

  • దయాకర్ రావు ఇన్నాళ్లూ సరైన పార్టీలో లేరు
  • సరైన నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ లో చేరారు
  • అందుకే, ప్రజలు ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించారు

జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య మంచి మెజార్టీతో విజయం సాధించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును యాభై మూడు వేల మెజార్టీతో ప్రజలు గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే, దయాకర్ రావుకి ఒకటే చెప్పా. ఇన్నిరోజులు సరైన పార్టీలో లేరని, ఇప్పుడు సరైన పార్టీలో ఉన్నారు కనుకే యాభై మూడు వేల మెజార్టీ వచ్చిందని చెప్పానని అన్నారు.

ఎమ్మెల్యేగా దయాకర్ రావు గెలవడం ఇది ఆరోసారి అని, ఈ ఆరు సార్లలో ఇప్పుడే ఆయనకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పారు. ‘రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ’ అన్నట్టుగా ఆయన సరైన నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ లో చేరారని, అందుకే, ఆయనకు మద్దతుగా ప్రజలు కూడా కరెక్టు నిర్ణయం తీసుకున్నారని దయాకర్ రావుకి చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

More Telugu News