chinta mohan: రాని యుద్ధాల కోసం.. పోయిన చోటల్లా విమానాలు కొంటున్నారు: మోదీపై చింతా ఫైర్

  • దేశ సంక్షేమాన్ని మోదీ విస్మరించారు
  • తెలివి తక్కువ విధానాలతో దేశం భ్రష్టు పట్టింది
  • నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది

ప్రధాని మోదీ, బీజేపీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలివి తక్కువ విధానాలతో దేశం భ్రష్టు పట్టిందని అన్నారు. నాలుగేళ్ల మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ధరలు, పేదరికం విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. దేశ సంక్షేమాన్ని మోదీ పూర్తిగా విస్మరించారని అన్నారు. రాని యుద్ధం కోసం పోయిన చోటల్లా యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైందని అన్నారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని చింతా మోహన్ చెప్పారు. ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై సంక్రాంతి నాటికి ఏపీసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల స్థానాలు పెరిగాయని చెప్పారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, వృద్ధాప్య పించన్ల పెంపు, ఎంఐఎంతో పొత్తు టీఆర్ఎస్ కు కలసి వచ్చాయని అన్నారు.

More Telugu News