modi: కేసీఆర్ ను ఏపీపైకి ఉసిగొల్పుతున్నారు: మోదీపై బుద్ధా వెంకన్న ఫైర్

  • ప్రత్యేక హోదాపై ప్రకటన చేశాకే ఏపీలో అడుగుపెట్టాలి
  • మోదీ శకుని పాత్రను పోషిస్తున్నారు
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని మోదీ ఆంద్రప్రదేశ్ లో అడుగుపెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను విడుదల చేయకుండా ఏపీపై కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, శకుని పాత్రను మోదీ పోషిస్తున్నారని మండిపడ్డారు. ఏపీపైకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉసిగొల్పుతున్నారని అన్నారు. అసమర్థుడైన ప్రధాని మోదీ అని అన్నారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వచ్చే నెల 6న విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని చెప్పారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
modi
kct
budda venkanna
Telugudesam
bjp
TRS

More Telugu News