Vishal: నిన్న మాట్లాడని పోలీసులు నేడు అరెస్ట్ చేస్తారా?: విశాల్ మండిపాటు

  • నిన్న కార్యాలయానికి తాళం వేసిన సమయంలో పోలీసుల మౌనం
  • తప్పేమీ లేకున్నా అరెస్ట్ చేయడాన్ని నమ్మలేకున్నా
  • ఇళయరాజా సంగీత విభావరి జరిగితీరుతుందన్న విశాల్
నిన్న కొందరు తన కార్యాలయానికి తాళం వేసిన సమయంలో మౌనంగా ఉన్న పోలీసులు, నేడు తనను ఎలా అరెస్ట్ చేస్తారని హీరో విశాల్ ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, ఈ విషయంలో తాను పోరాడతానని అన్నారు. ఇళయరాజా సంగీత విభావరిని నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ తీసుకుంటామని, ఆయన కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను నష్టాల్లో ఉన్న నిర్మాతలకు సాయం చేసేందుకు ఉపకరిస్తామని అన్నారు. తన తప్పేమీ లేకున్నా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నమ్మలేకున్నానని వ్యాఖ్యానించారు.



Vishal
Arrest
Twitter

More Telugu News