పెథాయ్ తుపాన్ తో అవనిగడ్డలో మళ్లీ పాముల కలకలం!
- పొలాల్లో కనిపిస్తున్న పాములు
- రక్తపింజరలు కనిపించడంతో కొట్టి చంపిన ప్రజలు
- మళ్లీ మొదలైన భయాందోళనలు
చెరువు అనే గ్రామంలో ప్రాణాంతకమైన రక్తపింజరలు బయటకు రావడంతో ప్రజలు వాటిని కొట్టి చంపారు. ఓ రైతు తన పొలంలో తడిసిన వరి పనలను సర్దుతుండగా, ఇవి కనిపించాయి. మరోవైపు దివిసీమలోనూ పలు ప్రాంతాల్లో విషసర్పాల సంచారం అధికమైంది. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పలువురిని పాములు కాటు వేసిన సంగతి తెలిసిందే.