Nenu C/o Nuvvu: ట్రైలర్ లోనే ఇన్ని బూతులా?... 'నేను కేరాఫ్‌ నువ్వు' సినిమాపై ఫిర్యాదు!

  • తుమ్మ సాగారెడ్డి దర్శకత్వంలో చిత్రం
  • ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా ఉందని ఫిర్యాదు
  • పలు చోట్ల పోలీసులను ఆశ్రయించిన కుల సంఘాలు

1980వ దశాబ్దపు యథార్ధ ప్రేమకథ అంటూ తుమ్మ సాగారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'నేను కేరాఫ్ నువ్వు' చిత్రం వివాదంలో చిక్కుకుంది. రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ కాగా, దీనిలో బూతులు, సమాజాన్ని తప్పుదారి పట్టించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, మాల సంక్షేమ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ షాబాద్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కులాల కుంపటిని రాజేసి, తెలుగు రాష్ట్రాల్లోని శాంతి వాతావరణాన్ని చెడగొట్టేలా ఇందులో మాటలున్నాయని ఆయన ఆరోపించారు.

ఇదిలావుండగా, ఈ చిత్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరిచేలా సంభాషణలు, సన్నివేశాలున్నాయని మేడ్చల్ జిల్లా షెడ్యూల్ కులాల హక్కల పరిరరక్షణ సంఘం నేరేడ్ మెట్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, సోషల్ మీడియా నుంచి ట్రైలర్ ను తొలగించాలని సంఘం నేతలు పోలీసులను కోరారు.

కాగా, ఈ చిత్రం ట్రైలర్ లో "చదువులకు, ఉద్యోగాలకు మేము మీతో సమానం కాదని.. చదివి ఉద్యోగాలు తెచ్చుకునే వారు ప్రేమ, పెళ్ళి విషయానికి వచ్చేసరికి మనుషులంతా సమానమే అని ఎలాగంటారు?" అని ప్రశ్నించడం, "నిన్ను సుఖ పెట్ట‌డానికి మ‌నం కులం వాడు దొర‌క‌లేదా?" వంటి వివాదాస్పద డైలాగులు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News