Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఫుడ్ అంటే పడిచస్తానంటున్న నాయిక!
  • వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ 
  • నూతన దర్శకుడితో కార్తికేయ సినిమా

*  తనకి ఇష్టమైన ఆహారం కనిపిస్తే కనుక నోరు కట్టేసుకోలేనని అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. "అవును, నేను ఫుడ్ అంటే పడి చస్తాను. అయితే, ప్రతిదీ ఏదో ఇంతింత లాగించేయను. తినాలనిపించింది తింటాను, అయితే పరిమితిలో తింటాను" అని చెప్పింది.
*  ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ మరో రెండు సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వీటిలో వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వం వహించే చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  'ఆర్ ఎక్స్ 100' ఫేం కార్తికేయ నటించే తదుపరి చిత్రం షూటింగ్ ఈ నెల 27న ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

More Telugu News