stalin: రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించిన స్టాలిన్ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందన

  • అది కేవలం స్టాలిన్ అభిప్రాయం మాత్రమే
  • కూటమి అభిప్రాయంగా పరిగణించకూడదు
  • విపక్షాలను ఏకం చేసే పనిలో మమత, పవార్ తదితరులు ఉన్నారు

ప్రధాని మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కేంద్ర స్థాయిలో ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నానని అన్నారు.

ఈ వ్యాఖ్యలు విపక్షాలలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, అది కేవలం స్టాలిన్ వ్యక్తిగత అభిప్రాయమని... దాన్ని కూటమి అభిప్రాయంగా పరిగణించకూడదని చెప్పారు. విపక్షాలను ఏకం చేసే పనిలో మమతా బెనర్జీ, శరద్ పవార్ తదితరులు ఉన్నారని తెలిపారు. స్టాలిన్ వ్యాఖ్యలపై ఇప్పటికే మమత అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాతే కూటమి తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 

More Telugu News