Rs 100 crore fund: కేంద్రం యూటర్న్.. పిల్లల అసాధారణ జబ్బుల కోసం కేటాయించిన రూ.100 నిధిపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం!

  • సరైన సంప్రదింపులు లేకుండానే ప్రకటించింది
  • రూ. 100 కోట్లు కేటాయించడం అసాధ్యం
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఆరోగ్య శాఖ

అసాధారణ జబ్బులతో బాధపడే చిన్నారుల కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు గతేడాది ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గత వారం సుప్రీంకోర్టుకు నివేదించిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొంది.

అసాధారణ జబ్బులతో బాధపడే చిన్నారుల కోసం వంద కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం సరైన సంప్రదింపులు జరపకుండానే ప్రకటించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్‌లో దీనిని పొరపాటుగా చేర్చిందని వివరించింది. ఈ పథకం కోసం రూ. 100 కోట్లు కేటాయించడం దుర్లభమని స్పష్టం చేసింది.

More Telugu News