ys jagan: వైఎస్ జగన్ ని త్వరలోనే కలుస్తా: గంగుల భానుమతి

  • రాజకీయంగా జగన్ వెంటే నేను నడుస్తా
  • నాకు పదవో, టిక్కెటో అక్కర్లేదు
  • పార్టీ కోసం పాటుపడతా.. ప్రజా సేవ చేస్తా
రాజకీయంగా జగన్ వెంటే తాను నడుస్తానని మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి చెప్పారు. జగన్ కచ్చితంగా తమకు సపోర్టు చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. తన భర్త సూరి హత్య కేసులో తుది తీర్పు కోసమే ఇన్నాళ్లూ ఆగానని, త్వరలో వైఎస్ జగన్ ని కలుస్తానని చెప్పారు. తన కేమీ పదవి కావాలని, టికెట్ కావాలని కోరుకోవడం లేదని, పార్టీ కోసం పాటుపడతానని చెప్పారు. తమ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి చదువుకుంటున్నాడని, తాను మాత్రం రాజకీయ జీవితం గడుపుతానని ఆమె స్పష్టం చేశారు. తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రజా సేవ చేసుకుంటూ ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ జీవితంలోకి తన కొడుకుని తీసుకురానని అన్నారు.
ys jagan
YSRCP
gangula bhanumati
politics

More Telugu News