ipl-12: ఐపీఎల్ వేలం.. ఎట్టకేలకు యువరాజ్ సింగ్ కొనుగోలు

  • యువరాజ్ ని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
  • యూవీని రూ.కోటికి కొనుగోలు చేసిన జట్టు
  • రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన వరుణ్ చక్రవర్తి  

జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-12 వేలం పాటలో యువరాజ్ సింగ్ ను ఎట్టకేలకు కొనుగోలు చేశారు. వేలం ప్రారంభమై కొన్ని గంటలు గడిచినా యువరాజ్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరకు, యువరాజ్ ను కోటి రూపాయలతో ముంబై ఇండియన్స్ రెండో రౌండ్ లో కొనుగోలు చేసింది. పదహారేళ్ల యంగ్ ఆల్ రౌండర్ బర్మాన్ ని రూ.1.50 కోట్లకు ఆర్సీబీ, పృథ్వీరాజ్ ను రూ.20 లక్షలకు కేకేఆర్, లివింగ్ స్టన్ రూ.50 లక్షలకు, కీమో పాల్ ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

వికెట్ కీపర్, అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ సిమ్రాన్ సింగ్ ను రూ.4.80 కోట్లతో కింగ్స్ పంజాబ్ జట్లు కొనుగోలు చేయడం ఆసక్తికరం. కాగా, వరుణ్ చక్రవర్తి రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాడు. అతన్ని రూ 8.40 కోట్లతో కింగ్స్ పంజాబ్ జట్టు కొనుగోలు చేయగా, సామ్ కుర్రాన్ ను రూ.7.2 కోట్లతో అదే జట్టు సొంతం చేసుకుంది.

More Telugu News