Telangana: తెలంగాణలో రేపటి నుంచి మరింత పెరగనున్న చలి తీవ్రత!

  • ‘పెథాయ్’ ప్రభావంతో తగ్గిపోయిన పగటి ఉష్ణోగ్రతలు
  • సాధారణం కంటే 7- 8 డిగ్రీలు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఆయా జిల్లాల కలెక్టరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

పెథాయ్ తుపాన్ ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే 7 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి తోడు ఉత్తర భారత దేశం శీతల గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే చలి తీవ్రత బాగా ఉంది. రేపటి నుంచి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్, భద్రాచలం, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం అసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, వారికి అవసరమైన మందులు, దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News