bse: లాభాలతో ముగిసిన నేటి స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ కి 77, నిఫ్టీకి 20 పాయింట్ల లాభం 
  • డాలర్ తో రూపాయి మారకం విలువ 70.78 
  • లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ షేర్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 36,347 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,909 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 76 పైసలు కోలుకుని 70.78గా కొనసాగుతోంది.

ఇక, ఆయా షేర్ల విషయానికొస్తే.. ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత సంస్థల షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్  లిమిటెడ్, జీ ఎంటర్ టెయిన్ మెంట్స్, టెక్ మహీంద్రా, విప్రో,  ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు నష్టపోయాయి. కాగా, చివరి సమయంలో ఆటో మొబైల్, బ్యాంకింగ్, లోహ, ఫార్మా రంగాల షేర్లు రాణించడంతో వరుసగా ఆరో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం.

  • Loading...

More Telugu News