Andhra Pradesh: నా భర్తను పరిటాల కుటుంబమే చంపించింది.. వాళ్లపై కూడా విచారణ జరపాల్సింది!: సూరి భార్య భానుమతి

  • మా కుటుంబానికి భాను నమ్మకద్రోహం చేశాడు
  • పరిటాల కుటుంబం నుంచి సుపారీ తీసుకున్నాడు
  • కోర్టు మరణశిక్ష విధించి ఉంటే బాగుండేది
భానుకిరణ్ తమ కుటుంబానికి నమ్మకద్రోహం చేశాడనీ, అతను విశ్వాస ఘాతకుడని మద్దెలచెరువు సూరి భార్య భానుమతి విమర్శించారు. అతనికి యావజ్జీవశిక్ష కాకుండా ఉరిశిక్ష విధించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పరిటాల సునీత కుటుంబమే భానుకిరణ్ చేత సూరిని హత్య చేయించిందని ఆమె ఆరోపించారు. సుపారీ ఇచ్చి సూరిని హత్యచేసిన పరిటాల కుటుంబంపై కూడా విచారణ జరిపి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తన భర్త పేరును వాడుకుని భాను కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశాడని దుయ్యబట్టారు.
Andhra Pradesh
Telangana
Hyderabad
suri
bhanumati
nampally court
judgement

More Telugu News